- పూజలు చేసిన దిల్ రాజు, తనికెళ్ల భరణి
బాసర, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆదివారం సినీ ప్రముఖులు దర్శించుకొని పూజలు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సీనియర్నటుడు తనికెళ్ల భరణి కుటుంబ సమేతంగా వేర్వేరుగా ఆలయానికి చేరుకోగా.. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో తనికెళ్ల భరణి తన మనువడికి అక్షరాభ్యాస పూజ జరిపించారు.
దిల్ రాజు కుంటుంబ సభ్యులతో ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి కుంకుమార్చన పూజ జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు. వారిని శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. వారితో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.