కొరియోగ్రాఫర్ జానీపై ఇటీవలే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించిన విషయంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు బాధితురాలికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఈ అత్యాచార ఆరోపణల నైపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఫిలిం చాంబర్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణ పూర్తయ్యేంతవరకు కొరియోగ్రాఫర్ జానీ పై నిషేధం విధించినట్లు అధికారికంగా ప్రకటిచారు.
మరోవైపు జనసేన పార్టీ కూడా కొరియాగ్రాఫర్ జానీని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే, ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జానీ పరారీలో ఉన్నారని తెలుస్తోంది.