
- ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉద్యమాన్ని నేను లీడ్ చేస్తా: దిల్ రాజు
హైదరాబాద్, వెలుగు: సినిమా పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం రావాలని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ ఉద్యమంలో నిర్మాతలు అంతా కలిసి వస్తే, తాను ముందుండి లీడ్ చేస్తానని చెప్పారు. బుధవారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీసులో దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్, ఇటీవల రిలీజ్ అయిన తండేల్ మూవీ పైరసీకి గురయ్యాయని, దీంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని తెలిపారు.
సినిమా పైరసీకి గురైతే నిర్మాతలే నష్టపోతున్నారని, హీరోలు, ఆర్టిస్టులు, డైరెక్టర్స్ అంతా సేఫ్‌గా ఉంటారని, నెక్స్ట్ సినిమా షూట్స్‌లో బిజీ అయిపోతున్నారని చెప్పారు. పైరసీ అంశాన్ని నిర్మాతలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవటం లేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. వేరే ప్రొడ్యూసర్ నష్టపోతే తమకేంటి అని అనుకుంటే.. రానున్న రోజుల్లో ఆ నిర్మాతల సినిమాలు కూడా పైరసీకి గురవుతాయని ఆయన వివరించారు.