సృజనాత్మకతతోనే బిజినెస్​లో సక్సెస్​ : సినీ డైరెక్టర్​ శేఖర్​ కమ్ముల

సృజనాత్మకతతోనే బిజినెస్​లో సక్సెస్​ : సినీ డైరెక్టర్​ శేఖర్​ కమ్ముల

పద్మారావునగర్​, వెలుగు: బిజినెస్​ మేనేజ్​ మెంట్ విద్యార్థులు వ్యాపార మెళుకులవలను నేర్చుకోవాలని, సృజనాత్మకతతోనే బిజినెస్​ లో సక్సెస్​ అవుతారని   డైరెక్టర్​ శేఖర్​ కమ్ముల అన్నారు. శుక్రవారం పద్మారావునగర్​ లోని సర్దార్​ పటేల్​ డిగ్రీ, పీజీ కాలేజీ లో ప్రారంభమైన రెండు రోజుల బిజినెస్​ మేనేజ్​మెంట్ ఫెస్ట్​ సమన్వయ-2025 కార్యక్రమానికి ఆయన చీఫ్​ గెస్ట్​ గా అటెండ్​ అయ్యారు.  

కాలేజీ ఆవరణలో ఫుడ్​ స్టాల్స్​ ను, ఆయా కార్పొరేట్​ కంపెనీలు తమ ప్రొడక్ట్ స్టాల్స్​ లను  ఏర్పాటు చేశారు. కాలేజీ చైర్మన్​ పి.హరినాథ్​ రెడ్డి, కార్యదర్శి జీవి.రంగారెడ్డి, ట్రెజరర్​ శ్రీనివాస్​, ప్రిన్సిపాల్​ డా.హేమలత,డా.అమర్​నాథ్​,రాహుల్​ యాదవ్​, అనుప యాదవ్​, పల్లవి,రమేశ్​, సిబ్బంది పాల్గొన్నార