ఇండియాలో ఎంతో మంది ధోనీలున్నరు

ఇండియాలో ఎంతో మంది ధోనీలున్నరు

ఇండియన్​ స్కూల్స్​ బోర్డు ఫర్​ క్రికెట్​ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ​రాజమౌళి

హైదరాబాద్​, వెలుగు : ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నియమితుడయ్యారు. ‘నాకు క్రికెట్​అంటే ఇష్టం. చిన్నప్పుడు మా ఊర్లో క్రికెట్​ ఆడుతున్నప్పుడు  ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లభించని చాలా మందిని చూశా. నేను ఆరాధించే లెజెండరీ క్రికెటర్​ ఎంఎస్​ ధోనీ రాంచీ అనే చిన్న పట్టణం నుంచి వచ్చారు. ఇండియాలో చాలా మంది ధోనీలు ఉన్నారు. వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ చక్కటి వేదికగా నిలుస్తుంది’ అని శనివారం జరిగిన మీడియా సమావేశంలో రాజమౌళి తెలిపారు. 

12 నుంచి 16 ఏండ్ల చిన్నారులు తమ క్రికెట్​ టాలెంట్​ను చూపెట్టే నిమిషం వీడియోను ఐఎస్​బీసీ వెబ్​సైట్​, యాప్​లో అప్​లోడ్​ చేయాలని ఐఎస్​బీసీ ఫౌండర్​, సీఈవో  కె. సునీల్ బాబు చెప్పారు. ‘దేశ వ్యాప్తంగా టాలెంట్ హంట్, క్యాంప్​లతో పాటు జిల్లా, స్టేట్​, ఇంటర్​ జోన్ లెవెల్​​ టోర్నీలు నిర్వహిస్తాం.  ఇండియన్ స్కూల్ టాలెంట్ లీగ్ కోసం 10 జట్లను ఏర్పాటు చేస్తాం. లీగ్​ పెర్ఫామెన్స్​ ద్వారా 2024 జనవరిలో జరిగే స్కూల్ వరల్డ్ కప్​లో పాల్గొనే ఇండియా టీమ్​కు ఎంపిక చేస్తాం’ అని సునీల్​ వివరించారు.