బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సినిమా..ఎమర్జెన్సీని అడ్డుకున్న ఖలిస్థానీయులు

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సినిమా..ఎమర్జెన్సీని అడ్డుకున్న ఖలిస్థానీయులు

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌ చేసి, నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి బ్రిటన్‌‌‌‌లో అడ్డంకులు ఎదురయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనను ఖలిస్థానీ మద్దతుదారులు అడ్డు కోవడంపై భారత కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. 

విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌‌‌‌ధీర్‌‌‌‌‌‌‌‌ జైస్వాల్‌‌‌‌ మాట్లాడుతూ.. ‘‘బ్రిటన్‌‌‌‌లోని పలు థియేటర్లలో ‘ఎమర్జెన్సీ’ సినిమాను కొంతమంది ఎలా అడ్డుకుంటున్నారో వచ్చిన నివేదికలను మేము గమనించాం. భారత వ్యతిరేకుల నుంచి వస్తున్న బెదిరింపులు, హింసాత్మక నిరసనలపై యూకే ప్రభుత్వం వద్ద నిరంతరం లేవనెత్తుతూనే ఉన్నాం. 

వాక్‌‌‌‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను సెలెక్టివ్‌‌‌‌గా ఉపయోగించుకోవద్దు. సినిమాను అడ్డుకుంటున్న వారిపై యూకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. మా ప్రజల భద్రత, ప్రయోజనాల కోసం లండన్‌‌‌‌లోని మా హైకమిషన్‌‌‌‌ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం” అని పేర్కొన్నారు. కొంతమంది ఖలిస్థానీ మద్దతుదారులు ఎమర్జెన్సీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద మాస్కులు ధరించి ఆందోళనలు చేస్తున్నారు.