ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హీరో రాజ్ తరుణ్​ పిటిషన్

ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హీరో రాజ్ తరుణ్​ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ నార్సింగి పోలీసు స్టేషన్‌‌లో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్‌‌ ఇవ్వాలంటూ సినీ హీరో రాజ్‌‌ తరుణ్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు కౌంటర్‌‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడంటూ రాజ్ తరుణ్​పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 కేసు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను రాజ్ తరుణ్ హైకోర్టులో సవాల్ చేశారు. గురువారం ఈ పిటిషన్​ కోర్టులో విచారణకు వచ్చింది. పోలీసుల విచారణకు హాజరైతే రాజ్​ తరుణ్​ను అరెస్టు చేసే చాన్స్​ ఉందని, ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలివ్వాలని రాజ్ తరుణ్ తరఫు​ న్యాయవాది వాదించారు. పోలీసుల వివరణ నిమిత్తం విచారణను హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది.