డిసెంబర్ 26న సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఖరారయ్యింది. FDC చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు. తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బెన్ ఫిట్ షోలు, టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రకటించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని ప్రముఖ సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు బుధవారం (డిసెంబర్ 25) పరామర్శించారు . ఇందులోభాగంగా శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లని అడిగి తెలుసుకున్నారు.
Also Read : రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు
శ్రీతేజ్ స్పీడ్ గా రికవర్ అవుతున్నాడని దిల్ రాజ్ చెప్పారు. అలాగే 72 గంటల నుంచి వెంటిలేటర్ లేకుండా ఉన్నాడని తెలిపారు. ఇక డిసెంబర్ 26న ఉదయం 10 గంటలకి సినీ ఇండస్ట్రీ పెద్దలతో కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు వెల్లడించారు. ఇందులోభంగా ఇండస్ట్రీలోని సమస్యలగురించి చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు.