ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ లక్కీ భాస్కర్ చిత్ర ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా దేవర చిత్ర కలెక్షన్ల గురించి స్పందించాడు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ దేవర చిత్రం మొదటి రోజు కలెక్షన్లలో కొన్ని తప్పుడు లెక్కలు చూపించి ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వచ్చినట్లు చూపించినట్లు కొందరు బయటి వ్యక్తులు చర్చించుకుంటున్నారని అడిగాడు.
దీంతో నాగవంశీ స్పందిస్తూ తమకి వచ్చిన లెక్కలనే చూపించి జెన్యూన్ గా రిపోర్ట్స్ ఇచ్చామని అంతేతప్ప ఎలాంటి ఎక్స్ట్రా కలెక్షన్లు యాడ్ చేయలేదని స్పష్టం చేశాడు. అలాగే దేవర చిత్రాన్ని కొన్న తన డిస్ట్రిబ్యూటర్స్ లాభాలతో హ్యాపీ గా ఉన్నారని తెలిపాడు.
కలెక్షన్లు పోస్టర్ లో వేసి ప్రచారం చేసే విషయంపై కూడా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా కలెక్షన్లు విడుదల చేస్తే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారని, ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే నిర్మాతలు హ్యాపీ అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కలెక్షన్ల ప్రచార సంప్రదాయం హాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలలో కూడా ఉందనే అదేం తప్పు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read :- నిఖిల్ "అప్పుడోఇప్పుడోఎప్పుడో" సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక ఓ రిపోర్టర్ ఇలా కలెక్షన్ల వివరాలు బహిరంగంగా వెల్లడిస్తే ఐటీ దాడుల సమస్య ఉంటుంది కదా అని అడగ్గా, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లకి గ్రాస్, నెట్, షేర్ కలెక్షన్ల గురించి అవగాహన ఉంటుందని కాబట్టి తమకి ఎలాంటి సమస్య ఉండదని క్లారిటీ ఇచ్చాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగవంశీ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 109, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ చిత్రాలకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎన్‌బీకే 109 చిత్ర ట్రైలర్ మరియు టైటిల్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా అప్డేట్ ఇచ్చాడు. దీంతో బాలయ్య అభిమననులు పండగ చేసుకుంటున్నారు.