కొచి: కేరళలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో సినిమా షూటింగ్ చేయడం పట్ల హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయింది. అంగమాలి ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి మొత్తం సినిమా షూటింగ్ చేయడంతో కేరళ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో సినిమా షూట్ కు అనుమతి ఇచ్చిరోగులకు ఇబ్బందులు కలిగించే చేసినందుకు ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి, అంగమలై తాలూకా ఆస్పత్రి సూపరింటెండెంట్ ను కమిషన్ కోరింది.
నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మిస్తున్న పింక్లీ సినిమా షూటింగ్ గురువారం రాత్రి 6 గంటలకు అంగమలై ఆస్పత్రిలో జరిగింది. ఎమర్జెన్సీ రూమ్ లోని లైట్లు డిమ్ చేసి షూటింగ్ చేశారు. నటీనటులతో సహా దాదాపు 50 మంది అత్యవసర విభాగంలో షూటింట్ లో పాల్గొన్నారు. డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తుండగా షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఎమర్జెన్సీ విభాగంలోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు. మెయన్ గేట్ నుంచి ఎవరినీ లోపలికి రాకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది.
అయితే నిర్మాతల సంఘం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. షూటింగ్ .. అక్కడు పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించలేదని చెప్పింది. రాత్రి షూటింగ్ కోసం రూ. 10వేలు నిర్మాతలు చెల్లించారని తెలుస్తోంది. మీడియాలో వచ్చి వార్తల ఆధారంగా మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసిందని అంటున్నారు.