వయనాడ్ బాధితులకు సాయం చేయడానికి సినీ తారలు ముందుకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్.. కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు.. అందజేస్తామని తెలిపారు.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ దుర్ఘటన నుంచి వీలైనంత త్వరగా తేరుకోవాలంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరంజీవి.