- కొత్తగా ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు
- ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు సినీ ఇండస్ట్రీపై గైడెన్స్
- యాక్టింగ్, డైరెక్షన్ లో ఫిల్మ్ క్లబ్ రెడ్ కార్పెట్
సికింద్రాబాద్,వెలుగు :ఓయూ అంటే.. విద్యార్థుల సందడి.. క్లాసులు.. పరీక్షలు.. రీసెర్చ్ లు.. లైబ్రరీల్లో బుక్స్ తో కుస్తీలు.. ఇలాంటివి కనిపిస్తాయి. వీటితో పాటు మరో నయా ట్రెండ్ మొదలైంది. ఇకముందు లైట్స్ఆన్ .. స్టార్ట్ .. కెమెరా.. యాక్షన్ గా క్యాంపస్మారనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులను సినిమా ఇండస్ట్రీపై ప్రోత్సహించనుంది. అటువైపు ప్రమోట్చేయాలనే లక్ష్యంలో భాగంగా ఓయూ ఫిల్మ్క్లబ్అవతరించింది.
స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ లో ఇప్పటికే అవగాహన కలిగిన 30 మంది స్టూడెంట్స్ రెండు నెలల కిందట ఫిల్మ్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. దీని ఆవిర్భావానికి క్యాంపస్ పై తొలిసారిగా నిర్మించిన చిత్రమే ప్రేరేపించింది. ప్రస్తుతకాలంలో యూత్ స్టడీతో పాటు సినిమాలను కూడా కెరీర్ మార్చుకుంటున్నారు. అలాంటి వారికి చాన్స్ ఇవ్వాలనే సంకల్పంతోనే ఫిల్మ్ క్లబ్ఏర్పడినట్లు ఫౌండర్స్ చెప్పారు. సినిమాలే కాకుండా.. యాక్టింగ్‌లోనూ అవకాశాలు కల్పించడం, డైరెక్టర్లను పరిచయం చేయడం, కొత్త సినిమాలు తీయాలనుకునే నిర్మాతలను ఆహ్వానించడం ఫిల్మ్క్లబ్లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
వర్సిటీపై షార్ట్ ఫిల్మ్ తోనే క్లబ్ ఆలోచన
ఓయూలో జాగ్రఫీ సబ్జెక్టులో పోస్ట్ డాక్టోరల్స్టూడెంట్ చిలుకూరి లోకేశ్‌కుమార్, ఎమ్మెస్సీ విద్యార్థి ప్రణయ్ కుమార్, లింగ్విస్టిక్స్విద్యార్థి సందీప్ కిషన్ ఆలోచనలకు ప్రతి రూపమే ఓయూ ఫిల్మ్ క్లబ్. వర్సిటీ 107వ ఫౌండేషన్ డే వేడుకలకు వీరంతా వర్సిటీ హిస్టరీపై ‘‘ ఒక ఉషస్సు” షార్ట్ఫిల్మ్తీశారు.
ఇందులో వివిధ విభాగాలకు చెందిన స్టూడెంట్లు యాక్టింగ్ చేశారు. ఇది మంచి గుర్తింపు తెచ్చింది. దీంతో ఒక ఫిల్మ్ క్లబ్ అవసరమని, క్యాంపస్‌లోనే ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. క్లబ్ స్థాపనకు వర్సిటీ అధికారులను ఒప్పించి.. ఈనెల 7న ఫిల్మ్ క్లబ్‌ను స్టార్ట్ చేశారు. అప్పటి వీసీ ప్రొఫెసర్రవీందర్లోగోను అధికారికంగా ఆవిష్కరించారు.
ప్రొఫెషనల్ గా మార్చడమే లక్ష్యంగా..
వర్సిటీపై తీసిన షార్ట్ ఫిల్మ్‌లో నటించిన నటులు, టెక్నిషియన్లకు మంచి గుర్తింపు లభించింది. షార్ట్ ఫిల్మ్ ను వెయ్యి మందికి పైగా వీక్షించారు. షార్ట్ ఫిల్మ్ మేకర్స్, డాక్యుమెంటరీ రైటర్స్ సొంతంగా రాసుకుని తీశారు. దీంతో సరైన గైడెన్స్లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ టెక్నిషియన్ ప్రణయ్ కుమార్ పేర్కొన్నారు.ఆరు షార్ట్‌ఫిల్మ్‌లు తీశానని, ఇకముందు క్లబ్ నుమంచి ప్లాట్‌ఫామ్ గా మారుస్తామని లింగ్విస్టిక్స్విద్యార్థి సందీప్ కిషన్ చెప్పారు.
షార్ట్ఫిల్మ్అడిషన్స్కు వెళ్లి సెలెక్టై నటించానని సైకాలజీ స్టూడెంట్శ్రీవిద్య తెలిపారు. ఇలా.. భవిష్యత్ లో షార్ట్ ఫిల్మ్ మేకర్లను ప్రొఫెషనల్ గా చేసేందుకు... డైరెక్షన్, ఎడిటింగ్ వర్క్ షాప్ ల నిర్వహించేందుకు సినీ ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ ను ఆహ్వానించాలని క్లబ్ యోచిస్తోంది. పూర్వ విద్యార్థులు, ఔత్సాహికులను కూడా స్వాగతించాలని భావిస్తోందని క్లబ్ మెంబర్స్ చెప్పారు.
అన్నిరంగాల్లో ఎదగాలనేదే లక్ష్యం
విద్యార్థులు చదువుతో పాటు కళారంగాల్లోనూ ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఓయూ ఫిల్మ్క్లబ్ఏర్పాటు చేశాం. విభిన్న నేపథ్యాలు, విభాగాలకు చెందిన కళాకారుల్లోని ప్రతిభను పెంపొందించడానికి క్లబ్దోహదపడుతుంది. సృజనాత్మకత వృద్ధి చెందడానికి, కథలు ప్రతిధ్వనించే వేదికగా ఉంటుంది. క్లబ్ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం.
చదువుకే పరిమితమనే అపోహను తొలగిస్తాం
క్యాంపస్ విద్యార్థులు అంటే బయట చదువులకే పరిమితమనే అపోహ ఉంది. అది తొలగించేందుకే ఫిల్మ్ క్లబ్ ను స్థాపించాం. ఎంతో మంది యాక్టింగ్, డైరెక్షన్, స్ర్కిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ వంటి అంశాల్లో ప్రతిభ కలిగిన కళాకారులు ఉన్నారు. వారిని ప్రోత్సహించాలనేదే క్లబ్ లక్ష్యం. 24 ఫ్రేమ్స్ ను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం.