జోగిపేటలోవాషింగ్టన్ ​సుందర్ సినిమా షూటింగ్

జోగిపేటలోవాషింగ్టన్ ​సుందర్ సినిమా షూటింగ్

జోగిపేట, వెలుగు: ఎస్ఎస్ మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న వాషింగ్టన్ ​సుందర్ ​చిత్రంలో కొంత భాగాన్ని బుధవారం జోగిపేటలో షూటింగ్​చేశారు.  సత్యా వినుగొండ దర్శకత్వం వహిస్తూ  హీరోగా నటిస్తున్నాడు. బసవ హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో పుష్ప మూవీలో సీఎం క్యారెక్టర్​లో నటించిన అధూ కలం నరేన్,  మురళీధర్ గౌడ్,  నాగ మహేశ్, బలగం మూవీ నటులు సంజయ్ కృష్ణ, శేఖర్,  జాతి రత్నాలు సినిమాలో చేసిన ప్రేమ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. జోగిపేట కళా సమితి వీరిని సన్మానించింది. సమితి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సభ్యులు సుగ్నేష్, అంజయ్య,  నవీన్ కుమార్ గౌడ్,  వెంకటేశం, పాండురంగం తదితరులున్నారు.