KA Pre Release Business: “క” మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్!..దుమ్ములేపుతోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

KA Pre Release Business: “క” మూవీకి  భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్!..దుమ్ములేపుతోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లేటెస్ట్ మూవీకి “క” KA అనే విభిన్నమైన టైటిల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్,కిరణ్ అబ్బవరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్,సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే 'క' మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా..మొన్నటి వరకు టీజర్ గురించి మాట్లాడుకున్న ఆడియన్స్ తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.30 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్ను ఫిల్మ్ మేకర్ మరియు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి 12 కోట్లకు ఎన్ఆర్ఐ బేసిస్ లో కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ సినిమా ఇతర భాషల థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ దాదాపు 18 కోట్ల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యేలా ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో రూ.30 కోట్ల రూపాయలపైనే "క" సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది.ఇది ఒకరకంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన మూవీగా 'క' నిలిచింది.

పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. నిజానికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోపై రూ.20 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు జరిగిన ప్రీ రిలీజ్ లెక్కలు ఎక్కువనే అంటూ సినీ సర్కిల్ లో టాక్ మొదలైంది. 

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తవగా..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.2018 ఫేమ్ తన్వి రామ్ హీరోయిన్.ఇకపోతే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీతో కిరణ్ ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.