కుంభమేళా సెన్సేషన్ మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్

కుంభమేళా సెన్సేషన్ మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్

‘కుంభ్ మేళా’ వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను పోలీసులు రేప్ కేసులో అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ను నిరాకరించడంతో పోలీసులు అతనిని సోమవారం అరెస్ట్ చేయడం గమనార్హం. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. హీరోయిన్గా అవకాశాలు ఇస్తానని చెప్పి ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన ఒక యువతితో ఇన్ స్టాగ్రాం, టిక్ టాక్ ద్వారా 2020లో సనోజ్ మిశ్రా పరిచయం పెంచుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఝాన్సీలోనే నివసిస్తోంది. ఆమెతో పలుమార్లు ఫోన్లో, వీడియో కాల్లో మాట్లాడిన సనోజ్ మిశ్రా.. జూన్ 17, 2021న ఝాన్సీ రైల్వే స్టేషన్కు వచ్చానని.. వెంటనే కలవాలని ఆమెకు కాల్ చేశాడు.

ఆమె కుదరదని చెప్పడంతో.. రాకపోతే చచ్చిపోతానని ఆమెను బెదిరించాడు. చచ్చిపోతానని బెదిరించడంతో మరుసటి రోజు సనోజ్ మిశ్రాను కలవడానికి బాధితురాలు ఒప్పుకుంది. జూన్ 18న మిశ్రా ఆమెను ఒక రిసార్ట్కు తీసుకెళ్లాడు. డ్రింక్లో మత్తు మందు కలిపి ఆమె స్పృహ కోల్పోయాక సనోజ్ మిశ్రా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. ఆమెను నగ్నంగా చేసి ఫొటోలు, వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై వేరు వేరు చోట్ల అత్యాచారానికి పాల్పడ్డాడు.

మహాకుంభమేళాలో స్పెషల్‌‌‌‌ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచిన అమ్మాయి మోనాలిసా భోస్లే(16)కు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని, డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకోనున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ.. సనోజ్ మిశ్రా అవకాశాల పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి శారీరక అవసరాలు తీర్చుకుంటాడని అతనిపై ఆరోపణలొచ్చాయి. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా తెరకెక్కించకుండా, డైరెక్టర్ అని చెప్పుకుని తిరుగుతుంటాడని ఇతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. మోనాలిసాది మధ్య ప్రదేశ్​లోని ఇండోర్. ఆమె కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది.

తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతున్నది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌కు వచ్చింది. అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన తేనె కాళ్లు చూసి కొంతమంది ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.