జానీ వ్యవహారంలో డైరెక్టర్ సుకుమార్ పేరు.. ?

జానీ వ్యవహారంలో డైరెక్టర్ సుకుమార్ పేరు.. ?

గత కొన్ని రోజులుగా కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల కేసు వ్యవహారం టాలీవుడ్ లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే కొరియోగ్రాఫర్ జానీ ని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండుకు తరలించి విచారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోమారు పోలీసులు జానీ ని విచారించారు. ఈ విచారణలో ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ పేరు వినబడటంతో ఒక్కసారిగా టాలీవడ్ సైన్ పరిశ్రమ ఉలిక్కిపడింది. 

అయితే జానీ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప 2 చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడని ఈ క్రమంలో తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితురాలు కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ఈ క్రమంలో కొద్దీ రోజులుగా జానీ ని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ప్రేమ, పెళ్లి పేరుతో మానసికంగా ఇబ్బంది పెట్టిందని దీంతో ఈ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ కి చెప్పానని దాంతో సుకుమార్ సదురు యువతితో మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయిందని జానీ పోలీసుల విచారణలో తెలిపాడు.

ALSO READ | కక్కమ్మా.. నిజం కక్కు: జానీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

ఇక కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసు బనాయించారని వాపోయాడు. అంతేగాకుండా తనపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాడు. దీంతో జానీ కేసులో రివర్స్ ట్విస్టులు ఉండటంతో రోజుకో కొత్తపేరు వినబడుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా కొరియోగ్రాఫర్ జానీ కి విధించిన 14 రోజల రిమాండు రేపటితో ముగియనున్నది. దీంతో బెయిల్ కోసం జానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.