
హైదరాబాద్: అరో రియాల్టీ టీ9 చాలెంజ్ టోర్నీలో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. శుక్రవారం హోరాహోరీగా సాగిన వేర్వేరు సెమీఫైనల్స్‌లో బంకర్ బస్టర్స్..సెమెట్రిక్‌పై, టూటోరూట్..లావిస్టా క్రూసేడర్స్‌పై గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లాయి. రెండో సెమీస్‌లో టూటోరూట్ 2.5–-1.5తో క్రూసేడర్స్‌పై అద్భుత విజయం సాధించింది.
సింగిల్స్‌లో టూటోరూట్ గోల్ఫర్ రే నోరోన్హ....రామ్(క్రూసేడర్స్)పై గెలువగా, శ్రీనివాసన్‌తో జరిగిన పోరును గౌతమ్ డ్రా చేసుకున్నాడు. డబుల్స్‌లో టూటోరూట్ ద్వయం దినేశ్‌కుమార్–అంగద్‌సింగ్.. క్రూసేడర్స్ జోడీ వాసు–శ్వేతపై నెగ్గారు. మరో పోరులో టూటోరూట్ ద్వయానికి ఓటమి ఎదురైంది. అంతకుముందు హోరాహోరీగా సాగిన తొలి సెమీస్‌లో బంకర్ బస్టర్స్.. సడెన్‌డెత్ ప్లే ఆఫ్స్‌లో సెమెట్రిక్స్‌ను ఓడించింది.