పార్లమెంట్ వింటర్ సెషన్​లోనే.. వక్ఫ్ బిల్లుపై తుది నివేదిక

 పార్లమెంట్ వింటర్ సెషన్​లోనే.. వక్ఫ్ బిల్లుపై తుది నివేదిక
  • కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై తుది నివేదికను అందజే స్తామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. ఆదివారం ఢిల్లీ లో ఆయన మాట్లాడారు. అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన మొదటి స్టడీ టూర్ లో పలు సూచన లు, సలహాలు తీసుకున్నట్లు తెలిపా రు. క్షేత్రస్థాయి స్టడీ టూర్లలో పరిశీ లించిన అంశాల ఆధారంగా జేపీసీ నివేదిక ఉంటుందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీ‌‌‌‌సీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోందన్నారు.