హైదరాబాద్‌‌లో సంతోష్‌‌ ట్రోఫీ ఫైనల్ రౌండ్‌‌

హైదరాబాద్‌‌లో సంతోష్‌‌ ట్రోఫీ ఫైనల్ రౌండ్‌‌

న్యూఢిల్లీ: సీనియర్ నేషనల్ ఫుట్‌‌బాల్ చాంపియన్‌‌షిప్ అయిన సంతోష్ ట్రోఫీ చివరి రౌండ్‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.  ఈ నెల 14 నుంచి ఫైనల్ రౌండ్ పోటీలు జరుగుతాయని ఆలిండియా ఫుట్‌‌బాల్‌‌ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌‌ఎఫ్‌‌) సోమవారం ప్రకటించింది.

 ఆతిథ్య తెలంగాణతో కలిపి 12 జట్లు పోటీ పడనున్నాయి. లీగ్‌‌ మ్యాచ్‌లు, క్వార్టర్ ఫైనల్స్ డెక్కన్ అరీనా గ్రౌండ్‌‌లో,  నెల 29న సెమీఫైనల్స్‌‌, 31న ఫైనల్‌‌ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతాయని ఏఐఎఫ్‌‌ఎఫ్‌‌ తెలిపింది.