Agent OTT: నిరీక్షణ ముగిసింది.. ఓటీటీకి వచ్చేసిన అఖిల్ ఏజెంట్.. ఎక్కడ చూడాలంటే?

Agent OTT: నిరీక్షణ ముగిసింది.. ఓటీటీకి వచ్చేసిన అఖిల్ ఏజెంట్.. ఎక్కడ చూడాలంటే?

అఖిల్ అక్కినేని (Akhil) నటించిన ఏజెంట్ (Agent) మూవీ ఓటీటీకి వచ్చేసింది. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. 2025 మార్చి 13న స్ట్రీమింగ్కి వచ్చింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఏజెంట్ డిజిటల్ ప్రీమియర్కి అడుగుపెట్టడం విశేషం.

నేడు మార్చి 14న వస్తుందని ముందుగా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే, మేకర్స్ అనౌన్స్ చేసినదానికి ఒక రోజు ముందే ఏజెంట్ స్ట్రీమింగ్కి రావడం విశేషం. సోనీ లివ్ ఓటీటీలోకి మార్చి 13న సాయంత్రం నుండి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో ఏజెంట్ మూవీలో చాలా వరకు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి థియేటర్లో భారీ డిజాస్టర్గా నిలిచిన ఏజెంట్..ఓటీటీ ప్రేక్షలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

ఇకపోతే, ఏజెంట్ బడ్జెట్ దాదాపు 80 కోట్లు. కానీ వచ్చింది మాత్రం 12 నుండి 13 కోట్లు. పెట్టిన బడ్జెట్ లో 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది ఏజెంట్ మూవీ. దీంతో హీరో అఖిల్, నిర్మాత అనిల్ సుంకర వీరిద్దరూ కోలుకోలేని డిజాస్టర్ అందుకున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ, యాక్షన్ థ్రిల్లర్గా రావడంతో మేకర్స్ భారీ స్థాయిలో ఖర్చుపెట్టారు. కానీ, భారీ డిజాస్టర్ సొంతం చేసుకున్నారు.

ALSO READ | హరి హర వీరమల్లు విడుదల వాయిదా.. పవన్ తప్పుకోవడంతో ఆ రెండు సినిమాలకు లైన్ క్లియర్

నిజానికి ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాడీ బిల్డింగ్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. కానీ, ఫైనల్ గా రిజల్ట్ మాత్రం మారలేదు. ఏదైతే ఏముంది.. అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏజెంట్ ఓటీటీకి రావడంతో ఖుషి అవుతున్నారు.

  • Beta
Beta feature