హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీలో ఎట్టకేలకు అంతర్గత బదిలీలు అయ్యాయి. శుక్రవారం కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్( ఏసీ) సీఎన్ రఘుప్రసాద్(శానిటేషన్), సామ్రాట్ అశోక్ (ఎస్టేట్)కు పోస్టింగ్ ఇచ్చారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి అదనంగా సీఎస్ఆర్, ఐటీ, రెవెన్యూ అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ కు ట్రాఫిక్ బాధ్యతలు అప్పగించారు. వై. శ్రీనివాస్ రెడ్డి (ఎస్టేట్ ఆఫీసర్) , జాయింట్ కమిషనర్ (జెడ్సీ) ఉమా ప్రకాశ్ (రెవెన్యూ), వాణిశ్రీ (స్పోర్ట్స్), మహేశ్ కులకర్ణి(అడ్మినిస్ట్రేషన్), కె. జయంత్ రావు(హెల్త్)
ఐటీ జాయింట్ కమిషనర్ సి. రాధ(ఎంపీడీఓ), రహేనా బేగం (ఖైరతాబాద్ జోన్ స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్), సుధాంశు (ఎస్ బీఎం,జెడ్సీ), జి. కృష్ణకుమారి(ఎల్ బీనగర్ జోన్ జెడ్సీ), ఎల్ బీ నగర్ జోన్ డీసీ (ఎస్ డబ్ల్యూఎం)గా మహముద్ షేక్, చార్మినార్ జోన్(ఎస్ డబ్ల్యూఎం) డీసీగా డి. శంకర్ సింగ్, సికింద్రాబాద్ జోన్ (ఎస్ డబ్ల్యూఎం) డీసీగా పద్మప్రియ, కూకట్ పల్లి జోన్(ఎస్ డబ్ల్యూఎం) డీసీగా డి. ఉదయ్ కుమార్ లకు నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు.
సర్కిల్ డీసీల బదిలీలు
శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ (డీసీ) గా ముకుందరెడ్డి, ఖైరతాబాద్ కు రజనీకాంత్ రెడ్డి, కాప్రా కు జగన్, చందానగర్ కు పి. మోహన్ రెడ్డి, ఫలక్ నుమాగా అరుణకుమారి చరణ్, సంతోష్ నగర్ కు ఎ. శైలజ, ఎల్ బీనగర్ కు సేవా ఎస్లావత్, యూసుఫ్ గూడ కు ఝాకియా సుల్తానాను నియమించారు.