SSMB29: ఫైనల్లీ.. సింహం బోను దాటింది.. పాస్పోర్ట్ చూపిస్తూ స్టైల్గా నడిచొస్తున్న మహేష్ బాబు

SSMB29: ఫైనల్లీ.. సింహం బోను దాటింది.. పాస్పోర్ట్ చూపిస్తూ స్టైల్గా నడిచొస్తున్న మహేష్ బాబు

మహేష్-రాజమౌళి SSMB29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో మహేష్ బాబు హైదరాబాద్కి విచ్చేశాడు. తరచుగా ఫ్యామిలీతో విహారయాత్రలకు వెళ్లే ప్రేమికుడిగా పేరుగాంచిన మహేష్ బాబు మరోసారి వార్తల్లో నిలిచాడు 

లేటెస్ట్గా హైదరాబాద్‌ ఎయిర్ పోర్ట్లో, మహేష్ తన కూతురు సితారతో కలిసి వస్తోన్న ఓ వీడియో వైరల్ అవుతుంది. రెండు వారాల పాటు నిరంతరాయంగా SSMB29 షూటింగ్‌లో ఉన్న మహేష్ బాబు.. ఇప్పుడు తన కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు.

ఇందులో మహేష్ స్టైలిష్ అవతారంలో కనిపించాడు. నవ్వుతూ తన పాస్‌పోర్ట్‌ను మీడియాకు చూపించాడు. అయితే, చివరికి నా పాస్ పోర్ట్ నాకొచ్చింది అనేలా చూపిస్తూ వచ్చాడు. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి తెగ నచ్చేస్తుంది. ఫైనల్లీ.. సింహం బోను దాటింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : సంధ్య థియేటర్‌ వద్ద పోలీస్ బందోబస్తుతో

అయితే, 2025 జనవరి చివర్లో.. రాజమౌళి తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పాస్ పోర్ట్ని చూపిస్తూ సింహాన్ని బోనులో బంధించినట్లు తెలిపాడు. అయితే సినిమా షూటింగులు లేనప్పుడు సందు దొరికితే విదేశాలకు వెళ్లిపోతుంటాడు మహేష్. దీంతో పాస్ పోర్ట్ ని రాజమౌళి తీసుకుని బ్రేక్ లేకుండా ఫాస్ట్గా షూటింగ్ చెయ్యాలని సింబాలిక్గా చెప్పాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన పాస్పోర్ట్తో స్వేచ్ఛగా రావడం అభిమానులని ఆకర్షిస్తోంది.

SSMB29 షూటింగ్ విషయానికి వస్తే:

SSMB29 ఫస్ట్ షెడ్యూల్.. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. అక్కడ రెండు వారాల పాటు అందమైన ప్రదేశాలలో జక్కన్న షూటింగ్ చేసి షెడ్యూల్ను ముగించారు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. అక్కడ సుమారు 15 రోజుల పాటు జరిగిన SSMB29 చిత్రీకరణలో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు జక్కన్న.

ఇక నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌లో SSMB29 బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనుల్లో చిత్రబృందం నిమగ్నమైంది. త్వరలో మహేష్ తదుపరి షెడ్యూల్ లో పాల్గొననున్నాడు. 

SSMB29 కథ:

SSMB29 సినిమా కథ.. చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసిందేకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట. అడ్వెంచర్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మైథలాజి అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.