ఫైనాన్స్ కంపెనీ దాష్టీకం... మహిళపై దాడి, కొడుకు కిడ్నాప్..

ఏపీలోని విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఫుల్ట్రాన్ ప్రవేట్ ఫైనాన్స్ కంపెనీ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. వేపాడ మండలం అరిగిపాలెంలో రాజేశ్వరి అనే మహిళకు అరవై వేలు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీ..ఫైనాన్స్ తిరిగి చెల్లించలేదని రాజేశ్వరి పై దాడికి పాల్పడింది.అనంతరం రాజేశ్వరి కుమారుడిని కిడ్నాప్ చేసి ఆఫీస్ లో బంధించారు రికవరీ ఏజెంట్స్. ఉదయం నుండి మైనర్ బాలుడుని ఆఫీసులోనే ఉంచిన సిబ్బంది తమ కుమారుడిని వదలాలని బ్రతిమలాడినా వదలలేదని తెలిపింది బాధితురాలు.

సదరు రికవరీ ఏజెంట్ కు తమ సంస్థ కు సంబంధం లేదని సంస్థ మేనేజర్ చేతులెత్తేశారు. అయితే, ఏజెంట్ లు రామకృష్ణ, శివలు రాజేశ్వరి కుమారుడిని వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటాడో చూపించమని తమతో రమ్మన్నామని, కిడ్నాప్ చేసే ఉద్దేశం తో తీసుకురాలేదని అంటున్నారు.