రష్యా ఆయిల్‌‌‌‌ కొంటున్నాం

న్యూఢిల్లీ: రష్యా ఆయిల్‌‌ను ఇప్పటికే కొనడం స్టార్ట్ చేశామని, మరింత ఆయిల్‌‌ను కొంటామని  శుక్రవారం జరిగిన ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్‌‌ మీటింగ్‌లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మంచి డీల్‌‌కే క్రూడాయిల్ దొరుకుతున్నప్పుడు ఆ వైపు చూడడం సహజమేనని ఆమె అన్నారు.  మరింత ఆయిల్‌‌ను కొనేందుకు తగిన ప్లాన్‌‌ను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్ హర్‌‌‌‌దీప్ సింగ్ పూరి తయారు చేస్తున్నారని సీతారామన్ పేర్కొన్నారు. ‘ మూడు నుంచి నాలుగు రోజులకు సరిపడ ఆయిల్ నిల్వలు రష్యా నుంచి ఇప్పటికే వచ్చాయి. మరింత కొంటాం. మనదేశ ప్రయోజనాలే మనకు ముఖ్యం’ అని ఆమె అన్నారు. రష్యా‑ఉక్రెయిన్‌‌ యుద్ధం కంటే ముందు ఉన్న క్రూడాయిల్ రేటులో 35 డాలర్ల వరకు తగ్గించి ఇండియాకు  క్రూడాయిల్‌‌ను అమ్మడానికి రష్యా రెడీ అయ్యింది.