బ్యాంకుల సాయంతోనే వికసిత్‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బ్యాంకుల సాయంతోనే వికసిత్‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా  అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో బ్యాంకుల పాత్ర కీలకమని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  90 వ ఫౌండేషన్ డే ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె మాట్లాడారు. ఎకానమీ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  సామాజిక అభివృద్ధి, మెరుగైన పర్యావరణం, సుపరిపాలనతోనే 2047 నాటికి వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించగలమని అన్నారు.  ప్రధాని మోదీ పెట్టుకున్న విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడంలో బ్యాంకులు కీలకమని,  వీటి పాత్రతో వేగంగా లక్ష్యాలను చేరుకోగలుగుతామని వివరించారు. 

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేగంగా పెంచడం, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈలకు అవసరమైన నిధులను అందించడం, ఇంకా బ్యాంక్ సేవలు అందని వారికి ఈ సేవలను అందించడం, ప్రజలందరికీ ఇన్సూరెన్స్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రొవైడ్ చేయడం వంటివి వికసిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగం’ అని పేర్కొన్నారు.  టెక్నాలజీ విస్తరిస్తుండడంతో డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెరిగాయని, వ్యవస్థ నమ్మదగ్గదిగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. హ్యాకింగ్ గురయ్యేటట్టు  డిజిటల్ సిస్టమ్స్ ఉండకూడదని బ్యాంకులను ఆదేశించారు. 

 యూపీఐని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయని అన్నారు. భూటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మారిషస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీలంక, యూఏఈలో యూపీఐ లాంచ్ అయ్యిందని గుర్తు చేశారు. బ్యాంకుల  నికర ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో  కొన్నేళ్ల కనిష్టమైన 0.6 శాతానికి తగ్గిందని మంత్రి నిర్మల అన్నారు.