డిపాజిట్లను ఆకర్షించే కొత్త స్కీమ్‌‌లు తేవాలి : నిర్మలా సీతారామన్

డిపాజిట్లను ఆకర్షించే కొత్త స్కీమ్‌‌లు తేవాలి : నిర్మలా సీతారామన్
  • బ్యాంకులకు మంత్రి నిర్మల సూచన

న్యూఢిల్లీ : డిపాజిట్లను ఆకర్షించడానికి  ఇన్నోవేటివ్ స్కీమ్‌‌లతో బ్యాంకులు ముందుకు రావాలని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్‌‌‌‌బీఐ బోర్డ్‌‌ మీటింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.  డిపాజిట్లు, అప్పులు రెండు చక్రాలాంటివని, డిపాజిట్‌‌ నెమ్మదిగా వెళుతోందని కామెంట్ చేశారు.  బ్యాంకులు తమ కోర్ బిజినెస్ అయిన డిపాజిట్లను సేకరించడం, అప్పులను ఇవ్వడంపై ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు.

వడ్డీ రేట్లను  రెగ్యులేట్ చేయడం లేదని, డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకులు వడ్డీ రేటును తరచూ పెంచుతుంటాయని  ఆర్‌‌‌‌బీఐ గవర్నర్  శక్తికాంత దాస్ పేర్కొన్నారు.  వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ బ్యాంకులకు ఉందన్నారు. బ్యాంకింగ్ సెక్టార్‌‌‌‌లో  డిపాజిట్లు, అప్పుల మధ్య బ్యాలెన్స్  పోతుండడంపై తాజాగా ఎంపీసీ మీటింగ్‌‌లో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.