మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పెరుగుతున్న స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌పై జాగ్రత్త : నిర్మలా సీతారామన్

మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పెరుగుతున్న స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌పై జాగ్రత్త : నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పెరుగుతున్న స్పెక్యులేటివ్ (ఊహాజనిత) ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌పై  జాగ్రత్త వహించాలని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్  ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. ఎక్కువ రిస్క్ ఉండే అసెట్స్‌‌‌‌‌‌‌‌లో  తమ సేవింగ్స్‌‌‌‌‌‌‌‌ను పెట్టి నష్టపోవద్దని పేర్కొన్నారు. మిడిల్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌పై ట్యాక్స్ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, అనేక చర్చల తర్వాత తక్కువ  ట్యాక్స్ స్లాబ్‌‌‌‌‌‌‌‌ రేట్లతో  కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చామని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  ఈ ఏడాది యూనియన్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో డైరెక్ట్ ట్యాక్స్ రేట్లను పెంచలేదని, స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ డిడక్షన్‌‌‌‌‌‌‌‌ను  పెంచామని  గుర్తు చేశారు.

 ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను సులభతరం చేయడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చామని, అందుకే మినహాయింపులను తొలగించామని సీతారామన్ వివరించారు. 78 శాతం మంది ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ పేయర్లు కొత్త పన్ను విధానానికి షిఫ్ట్ అయ్యారని తెలిపారు. జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రేట్లను తగ్గించడానికి మినిస్టర్ల గ్రూప్ పనిచేస్తోందని, ఎలా తగ్గించాలనేది ఈ గ్రూప్ ప్రపోజ్ చేస్తుందని, ఆ తర్వాత జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని    పేర్కొన్నారు. సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తనపై  వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని అన్నారు.