![రుషికొండ బిల్డింగ్ కాంట్రాక్టర్కు బిల్లులు ఎలా చెల్లిస్తారు : ఆర్థిక మంత్రి సీరియస్](https://static.v6velugu.com/uploads/2025/02/finance-minister-payyavula-seriou-on-officers-and-asks-how-will-bills-be-paid-to-rushikonda-building-contractor_UuWxgQVSrZ.jpg)
రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్ కు బిల్లులు ఎందుకు చెల్లింరంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అయితే దీనిపై అధికారులు మంత్రికి వివరణ ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులు చెల్లించలేదని అధికారులు వెల్లడించారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు చెల్లింపులు జరిగినట్టు వివరించారు.
అయితే అధికారుల వివరణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేరే బిల్లులైనా సరే.. ఆ కాంట్రాక్టర్ కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని మండిపడ్డారు. చెల్లింపులు జరపొద్దని చెప్పినా వినకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Also Read : ఏపీ తుళ్లూరులో మరో 8 నెలల్లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తాం
చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా..? లేక సొంత నిర్ణయమా..? అంటూ అధికారులను మంత్రి పయ్యావుల ప్రశ్నించారు. ఇకపై ఆ కాంట్రాక్టర్ చేపట్టిన ఎలాంటి పనులకైనా బిల్లుల చెల్లింపులు చేపట్టవద్దని సూచించారు. సీఎం లేదా తన దృష్టికి తీసుకురాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.