కొత్త మున్సిపాలిటీలకు 316 పోస్టులు మంజూరు

కొత్త మున్సిపాలిటీలకు 316 పోస్టులు మంజూరు
  • 91 మున్సిపల్ కమిషనర్లతో పాటు మరో 225 పోస్టులు

హైదరాబాద్, వెలుగు: కొత్త మున్సిపాలిటీలకు 316 పోస్టులను మంజూరు చేస్తూ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు 7, గ్రేడ్ 2 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు 43, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లు 41, హెల్త్ ఆఫీసర్లు 7, రెవెన్యూ మేనేజర్లు 11, సానిటరీ సూపర్ వైజర్ 10, సానిటరీ ఇన్​స్పెక్టర్ 86, హెల్త్ అసిస్టెంట్స్ 96, జూనియర్ అసిస్టెంట్ (హెచ్​వోడీ, రీజినల్ ఆఫీసులు)15 పోస్టులు ఉన్నాయి. నారాయణపేట, జనగామను అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలుగా ఏర్పాటు చేస్తూ మున్సిప ల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీల్లో మొత్తంగా 245 గ్రామాలు ఈ అథారిటీ పరిధిలో ఉన్నాయి. జనగామ పరిధిలో 133 గ్రామాలు ఉన్నాయి.