నిరుపేదకు రూ.50 వేల ఆర్థిక సాయం

  •     అందించిన ఎమ్మెల్యే పీఎస్సార్​

దండేపల్లి, వెలుగు: దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మారాజు సతీశ్ ఇంటి పైకప్పు రేకులు ఇటీవల వడగాలులకు కూలిపోగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బాధితుడిని సోమవారం పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.

అనంతరం నెల్కీ వెంకటాపూర్​లో కొక్కిరాల రఘుపతి రావు, వనపర్తి భూమయ్య జ్ఞాపకార్ధం ఎంపీటీసీ వనపర్తి మాలిక ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ యువసేన జిల్లా అధ్యక్షుడు కోట్నాక తిరుపతి తదితరులు పాల్గొన్నారు.