
పానగల్, వెలుగు: బైక్పై నుంచి పడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న మండలంలోని షాగాపూర్ అంగన్వాడీ టీచర్ అలివేల ఫ్యామిలీకి అంగన్వాడీ టీచర్లు అండగా చిలిచారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య ఖర్చుల కోసం రూ.1,34,700 అలివేల భర్త పరంధాములు. కూతురు పల్లవికి హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, అధ్యక్షుడు మండ్ల రాజు, బొబ్బిలి నిక్సన్, ఆర్ఎన్ రమేశ్. సూర్యవంశం రాము, నారాయణమ్మ, కవిత, శారద పాల్గొన్నారు.