
కోల్‌బెల్ట్,వెలుగు: మందమర్రి మార్కెట్ రెండోజోన్‌కు చెందిన చిన్నారులు ఒజ్జ హార్దిక్, కార్తీక్ కు శుక్రవారం ‘మా పద్మావతి వెల్ఫేర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.12వేల ఆర్థిక సాయం చేశారు. ఇటీవల వారి తల్లి అనారోగ్యంతో చనిపోగా అంతకుముందు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు అనాథలుగా మారారు. వీరికి ఫౌండేషన్స్ నిర్వాహకుడు అడ్వకేట్ రంజిత్‌గౌడ్ ఆధ్వర్యంలో దాతల నుంచి సేకరించిన ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు గుడ్ల రమేశ్, బుర్ర ఆంజనేయులు, సట్ల సంతోశ్, మహంతి అర్జున్, తిరుమల్‌రెడ్డి, సతీశ్, కిరణ్, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.