అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
  •     రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఘటన

సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : అప్పులబాధ తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటకు చెందిన బైరి అమర్ (41), స్రవంతి (34) గార్మెంట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారం చేస్తున్నారు. వీరికి లహరి, శ్రీవల్లి, దీక్షిత్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ ముగ్గురు పిల్లలు. ఇటీవల ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో రూ. 20 లక్షల లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకొని ఇల్లు కొన్నారు.

బిజినెస్‌‌‌‌‌‌‌‌ సరిగా నడవకపోవడంతో ఈఎంఐ కట్టలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన అమర్‌‌‌‌‌‌‌‌, స్రవంతి శనివారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకున్నారు. స్థానికులు వచ్చి ఎంత సేపు డోర్‌‌‌‌‌‌‌‌ కొట్టినా తీయలేదు. దీంతో బలవంతంగా ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసి చూడగా అప్పటికే చనిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.