అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణం తీశాడు..వడ్డీ వ్యాపారిని చంపి సంపులో పడేశాడు..

అప్పు ఇచ్చిన పాపానికి  ప్రాణం తీశాడు..వడ్డీ వ్యాపారిని చంపి సంపులో పడేశాడు..

హైదరాబాద్ ముషీరాబాద్ లో దారుణం జరిగింది. అప్పు ఇచ్చిన పాపానికి వ్యాపారిని హత్య చేశారు. తిరిగి ఇవ్వమని అడిగినందుకు చంపి నీటి సంపులో పడేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఏప్రిల్ 4న ఫైనాన్షియర్ సట్నం సింగ్  డబ్బులు వసూలు చేసేందుకు అల్వాల్ నుంచి ముషీరాబాద్ బోయి గూడ  వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టారు.  సట్నం సింగ్ ను చంపి సంపులో పడేసినట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు నవీన్ ను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు.  సట్నం సింగ్ దగ్గర అప్పు చేసిన నవీన్.. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగే సమయంలో ఇద్దరు గొడవపడ్డరు. దీంతో  సట్నం సింగ్ ను కత్తితో పొడిచి సంపూలో పడేసి వైజాగ్ పారిపోయాడు నిందితుడు నవీన్.  సట్నం సింగ్ మృతదేహంపై పలు కత్తిపోట్లు ఉన్నాయి. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసేందుకు యత్నించాడు నవీన్ అని పోలీసులు తెలిపారు.