వాళ్లు ఎక్కడున్నా వెతికి తీసుకురండి .. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

వాళ్లు ఎక్కడున్నా వెతికి తీసుకురండి .. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
  • హంతకుడికంటే పిల్లల విక్రేత ప్రమాదకరమని వ్యాఖ్య

ఢిల్లీ: తప్పిపోయిన ఆరుగురు పిల్లలు ఎక్కడున్నా వెతికి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పిల్లల్ని అక్రమ రవాణా చేసేవాళ్లు హంతకులకంటే ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది. నవజాత శిశువుల విక్రయాలు జరుగుతున్నాయని పత్రికల్లో వచ్చిన వార్తలను జస్టిస్​ బె.బి.పార్థివాలా, జస్టిస్​ ఆర్​.మాధవన్​లతో కూడిన ధర్మాసనం ఇవాళ సుమోటాగా విచారణకు స్వీకరించింది. 

ఈ విషయంలో పిల్లల్ని అమ్మేవాళ్లు, కొనేవాళ్లు బాధ్యతగా ఉండాలని సూచించింది. అలాంటి వాళ్లు సమాజానికి పెను ముప్పు అని పేర్కొంది. 'ఒక వ్యక్తి హత్య చేసేడానికి ఒక కారణం ఉండవచ్చు. మరోసారి అతడు హత్య చేయకపోవచ్చు. కానీ పిల్లల విక్రయాలకు పాల్పడే వాళ్లు ఆ నేరాలు పదే పదే చేస్తారు' అని వ్యాఖ్యానించింది.