
రాయికల్, వెలుగు : రాయికల్ పట్టణంలోని చికెన్ సెంటర్లను కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సిబ్బంది ఆదివారం తనిఖీలు చేశారు. నిబంధనలను పాటించని పలు చికెన్ సెంటర్లకు జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించని, నిల్వ ఉంచిన చికెన్ అమ్ముతున్న పలు సెంటర్ల యాజమానులను హెచ్చరించారు.