
హైదరాబాద్‌సిటీ నెట్వర్క్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మినహా మంగళవారం గ్రేటర్ లోని మిగిలిన ప్రాంతాల్లో సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ షాపులకు వచ్చిన ప్రజలకు స్థానిక నాయకులు దగ్గరుండి సంచుల్లో సన్న బియ్యం పోశారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కుందన్ పల్లిలోని రేషన్‌షాపులో మాజీ కౌన్సిలర్ వెంకటేశ్ బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. సన్న బియ్యం పథకం పేదల కడుపు నింపుతుందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే రేషన్‌షాపుల్లో సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్, సుశీల తదితరులు పాల్గొన్నారు.