గుడ్ న్యూస్: సన్నబియ్యం రేట్లు తగ్గుతున్నయ్.. క్వింటాపై రూ.500 తగ్గిన ధర

గుడ్ న్యూస్:  సన్నబియ్యం రేట్లు తగ్గుతున్నయ్.. క్వింటాపై రూ.500 తగ్గిన ధర
  • ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో మార్కెట్‌లో తగ్గుతున్న డిమాండ్ 
  • రూ.500 బోనస్‌తో పెరిగిన సన్నొడ్ల సాగు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు తగ్గుతున్నాయి. ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుండడం, సన్నొడ్లకు రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి కొనుగోలు చేస్తుండడంతో వాటి సాగు కూడా పెరగడం కారణంగా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ తగ్గి సన్నబియ్యం రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి. గత నెల వరకు ఫైన్ క్వాలిటీ రైస్ క్వింటాల్ రూ.5,500 నుంచి రూ.6,500 వరకు పలకగా.. ఇప్పుడు అవే వెరైటీలు క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త బియ్యం క్వింటాల్ రూ.5 వేల వరకే అమ్ముతున్నారు. ఇక పాత బియ్యం రకాల్లో సోనామసూరి రూ.5,400, ఆర్ఎన్ఆర్ రూ.5,400, హెచ్ఎంటీ రూ.5,600,  జైశ్రీరాం రూ.5,500  వరకు విక్రయిస్తున్నారు. 

బోనస్ ఇచ్చి కొనుగోలు.. 

సన్నొడ్లకు క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. అవే వడ్లను బియ్యంగా మార్చి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. దీంతో అటు సన్నొడ్ల సాగు పెరగడంతో పాటు ఇటు పేదలకు సన్నబియ్యం అందుతున్నాయి. ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సన్నొడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత వానాకాలం సీజన్ నుంచి దాన్ని అమలు చేస్తున్నది. దీంతో రాష్ట్రంలో సన్నొడ్ల సాగు పెరిగింది. గత వానాకాలంలో మొత్తం కోటి 53లక్షల ధాన్యం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చింది. ఇందులో దాదాపు 60 శాతం సన్నొడ్లే. అందులో 24 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. 4.41లక్షల మంది రైతులకు రూ.1,199 కోట్లు బోనస్​రూపంలో చెల్లించింది. 

రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంపిణీ..  

గతంలో రేషన్ లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. పేదలు వాటిని తినలేక తిరిగి డీలర్లకు లేదా దళారులకు అమ్ముకునేవారు. దీంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సన్నబియ్యానికి డిమాండ్​పెరిగి ధరలు విపరీతంగా ఉండేవి. అయితే ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించడంతో సీన్​రివర్స్​అయింది. ఆ బియ్యం తీసుకునేందుకు జనం రేషన్ షాపులకు పెద్ద ఎత్తున వస్తున్నారు. రైస్ క్వాలిటీగా ఉండడంతో వాటినే తింటున్నారు. గతంలో లాగా రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం లేదు. దీంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సన్నబియ్యానికి డిమాండ్ తగ్గింది. కాగా, ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 90,42,192 రేషన్​కార్డులు ఉండగా.. ఇప్పటికే 67,93,876 కార్డులకు సంబంధించి 2,05,41,825 మంది లబ్ధిదారులకు 1,41,792.95 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేసింది. అంటే ఇప్పటికే 75 శాతానికి పైగా లబ్ధిదారులకు ఈ నెల కోటా సన్నబియ్యం పంపణీ పూర్తయింది.