ఆస్తుల వివరాల నుంచి పర్సనల్ ఫొటోల వరకు ఇప్పుడన్నీ డ్రైవ్‌ల్లోనే సేవ్ చేసుకుంటున్నారు. కానీ.. విలువైన సమాచారాన్ని డ్రైవ్‌ల్లో పెట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. డ్రైవ్ ఎవరికి దొరికితే వాళ్ల చేతిలోకి ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్లిపోతుంది. అందుకోసమే కాన్ఫిడెన్షియల్ ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ‘న్యూక్యూ’ అనే కంపెనీ కొత్త రకం ఎస్.ఎస్.డి. డ్రైవ్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ డ్రైవ్‌కి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
దాన్ని ఉపయోగించి ఫింగర్‌ప్రింట్ లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసిన ఫింగర్‌ప్రింట్‌తో అన్‌లాక్ చేస్తేనే ఫైల్స్ యాక్సెస్ చేయడం వీలు పడుతుంది. ఈ డ్రైవ్‌కి మొత్తం10 వేర్వేరు ఫింగర్‌ఫ్రింట్స్‌ని సెట్ చేయొచ్చు. అంతేకాదు.. దీనికి పాస్‌వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మ్యాక్, ల్యాప్‌టాప్, ఐప్యాడ్, కంప్యూటర్ లాంటి అన్ని డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీని డాటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ. సెకన్‌కు 540 ఎంబీ డాటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ధర: 1 టీబీ డ్రైవ్ 23,980 రూపాయలు
కార్ లైటింగ్
కారులో మంచి సౌండ్ సిస్టమ్ పెట్టించుకుంటారు. కానీ.. అందుకు తగ్గట్టు ఇంటీరియర్ లైటింగ్ మాత్రం ఉండదు. కానీ.. ఈ గాడ్జెట్‌తో కారులో కూడా డీజే లైట్ల సెటప్ చేసుకోవచ్చు. కార్ ఫిల్ అనే కంపెనీ ఈ లైట్లను మార్కెట్‌లోకి తెచ్చింది. కారులో డీసీ కరెంట్‌తో వీటికి కనెక్షన్ ఇవ్వాలి. లైట్ స్ట్రిప్‌లను కారులో ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు. ఈ లైట్లను యాప్, రిమోట్‌తో ఆపరేట్ చేయొచ్చు. వీటి ద్వారానే లైట్లను ఆన్/ ఆఫ్ చేయొచ్చు. డిమ్‌నెస్, బ్రైట్‌నెస్ అడ్జెస్ట్‌మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో దాదాపు 29 మోడ్స్ ఉన్నాయి. 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి. ఈ డివైజ్‌కు మైక్రోఫోన్ కూడా ఉంటుంది. అందువల్ల కారులో మ్యూజిక్ పెట్టినప్పుడు ఆ సౌండ్‌కు తగ్గట్టు లైట్లు వెలుగుతాయి. బీట్‌ను బట్టి డిమ్ అవుతూ బ్రైట్ అవుతుంటాయి.
ధర : 1,499 రూపాయలు
డెస్క్ క్లాక్
టేబుల్ అలారం, క్లాక్, ఎలక్ట్రానిక్ క్యాలెండర్, ఫొటో డిస్‌ప్లే... ఇలాంటి పనులన్నీ ఒకే డివైజ్‌లో సెట్ చేసుకోవచ్చు. దీనికి ఆరు ఐపీఎస్ డిస్‌ప్లే ట్యూబ్స్ ఉంటాయి. వాటిని కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్యావ్స్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇందులో 2000mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ చేస్తే 10 గంటల వరకు పనిచేస్తుంది. ఇందులో మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు. 160 గంటల వరకు సూపర్ లాంగ్ స్టాండ్‌బై టైం ఉంటుంది. నాలుగు బ్రైట్‌నెస్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.
ధర : 19,999 రూపాయలు
గేమ్ కన్సోల్
వీడియో గేమ్స్ ఆడడం కొందరికి చాలా ఇష్టం. అందుకే చాలామంది పిల్లలు వీడియో గేమ్స్ ఆడే డివైజ్‌లు కొనమని మారాం చేస్తుంటారు. పిల్లల కోసం తక్కువ ధరలో దొరికే బెస్ట్ ఆప్షన్ ఇది. న్యూ వరల్డ్ అనే కంపెనీ దీన్ని అమ్ముతోంది. ఇందులో 400 రెట్రో క్లాసిక్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి. గేమ్స్ ఆడడమే కాదు.. దీన్ని ఒక గేమింగ్ కన్సోల్‌లా కూడా వాడుకోవచ్చు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. యూఎస్‌బీ కేబుల్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 800mAh లిథియం బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ కావడానికి గంటన్నర టైం పడుతుంది. ఆ తర్వాత నాలుగు గంటల వరకు ఆడుకోవచ్చు. దీన్ని ఏవీ కేబుల్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.
ధర: 699 రూపాయలు