
హైదరాబాద్: రూ.72 కోట్లు సీఎంఆర్బకాయిలతో డిఫాలర్ట్లిస్టులో బీఆర్‌ఎస్‌నేత, బోధన్మాజీ ఎమ్మెల్యే షకీల్ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నిజామాబాద్జిల్లాలో పనిచేసిన ముగ్గురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో అదనపు కలెక్టర్చంద్రశేఖర్, డీఎస్ వో చంద్రప్రకాశ్, డీటీ నికిల్రాజ్పై ఎఫ్ఐఆర్నమోదు చేశారు. షకీల్‌కు క్లీన్చీట్ఇచ్చేందుకు ధాన్యం అక్రమ బదిలీ చేయడంపై ఈ ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వర్నికి చెందిన మిల్లర్కిషోర్న్యాయపోరాటంతో అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అధికారులపై కేసుల వ్యవహారం జిల్లాలో హాట్‌టాఫిక్‌గా మారింది.