కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్ల చెలరేగుతాయంటూ కర్ణాటకలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ప్రతిపక్షాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
https://twitter.com/ANI/status/1651444810266611715?cxt=HHwWhsDUocSTjustAAAA
అమిత్ షాపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక సామాన్యుడు అదే కామెంట్స్ చేసి ఉంటే ఇప్పటికి అరెస్ట్ చేసి ఉండేవాడారని డీకే శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు అమిత్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
కర్ణాటకలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లేనిపోని గొడవలు జరుగుతాయని. పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, అందుకే ఆ పార్టీలకు ఓట్లు వెయ్యకూడదని బహిరంగ సభలో చెప్పారు.
కర్ణాటకలో మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడించనున్నారు. 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.