ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది... యమునా నది విషం అంశంలో కేజ్రీవాల్ పై హర్యానాలో కేసు నమోదయ్యింది. ఇటీవల కేజ్రీవాల్ యమునా నదిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విషం కలిపిందని ఆరోపించడం... ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రెజినా సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై షాబాద్ కు చెందిన జగన్ మోహన్ అనే లాయర్ కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ ఫిర్యాదుపై కేజ్రీవాల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. యమునా నది విషయంలో అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు జగన్ మోహన్.
ఈ మేరకు కేజ్రీవాల్ పై బీఎన్‌ఎస్ 192, 196 (1)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రధాని మోడీ, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఘాటుగా స్పందించారు..నయాబ్ సింగ్ యమునా నీటిని తాగి కేజ్రీవాల్ కు కౌంటర్ ఇవ్వగా.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కేజ్రీవాల్ పై ఫైర్ అయ్యారు.
Also Read : ఇండియాలో దిగిన అమెరికాలో అక్రమ వలసదారులు
ఇదిలా ఉండగా.. ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియాపై కూడా కేసు నమోదైంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే దినేష్ ఓ మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. ఆయనపై నెటిజన్లు కామెంట్ల రూపంలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.