డిప్యూటీ సీఎంపై జోకులు.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై కేసు

డిప్యూటీ సీఎంపై జోకులు.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై కేసు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్ర సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ( మార్చి 23 )రాత్రి ముంబైలోని యూని కాంటినెంటల్ హోటల్ లో నిర్వహించిన స్టాండప్ కామెడీ షోలో ఈమేరకు వ్యాఖ్యలు చేశారు కునాల్ కమ్రా. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేను గద్దార్ అంటూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా దిల్ తో పాగల్ హై సినిమా పాటను పేరడీ చేస్తూ సెటైర్లు వేశారు కునాల్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో షిండే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు కమ్రా షో జరిగిన హోటల్ పై దాడి చేసి ధ్వంసం చేశారు. కమ్రాను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమ్రా వ్యాఖ్యలపై శివసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. షిండే ఇమేజ్ ను దెబ్బ తీసే కుట్రలో భాగమే కమ్రా వ్యాఖ్యలు అని అంటున్నారు శివసేన నాయకులు.

Also Read : నాగ్​పూర్​లో కర్ఫ్యూ.. పూర్తిగా ఎత్తివేత

ఇదిలా ఉండగా..  ముంబైలో కూడా పెద్దఎత్తున నిరసనలు చేపట్టిన శివసేన కార్యకర్తలు కమీడియన్‌ కునాల్ కామ్రా ఫోటోలను తగలబెట్టారు. షిండేను టార్గెట్ చేస్తూ కమ్రా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.ఈ మేరకు శివసేన ఎమ్మెల్యే మురాజీ పటేల్ దాఖలు చేసిన ఫిర్యాదుతో కామ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.