- ఎన్నికల రూల్స్అతిక్రమించాడని ఆరోపణ
జనగామ, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైంది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ టైంలో రూల్స్‌ను అతిక్రమించి పోలింగ్‌బూత్‌లోకి వెళ్లాడనే ఆరోపణలతో జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జనగామ మండలంలోని శామీర్‌పేట పోలింగ్‌బూత్‌లోకి ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుని వెళ్లారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్‌తో పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో బూత్‌లోకి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బలవంతంగా పోలింగ్‌బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా కేసు నమోదైంది వాస్తవమేనని చెప్పారు.