ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్

ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళహాట్ పోలీసులు ఆయనపై కేసు బుక్ చేశారు. యూపీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్ 505(2), 171 C, r/w 171F, ఆర్పీ యాక్ట్లోని Sec.123 & 125 కింద ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. 

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్ బీజేపీకి ఓటు వేయని వారి ఇళ్లను బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరించారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఈసీ రాజాసింగ్కు నోటీసులు జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. అయితే గడువులోగా రాజాసింగ్ స్పందించకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై కేసు నమోదుచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది.  ఈసీ ఆదేశాలతో మంగళ్హాట్ పోలీసులు కేసు నమోదుచేశారు.

For more news..

కాన్పూర్ మేయర్పై ఎఫ్ఐఆర్ నమోదు

మోగాలో సోనూ సూద్‌ను అడ్డుకున్న అధికారులు