లేడీ డైరెక్టర్ పై క్రిమినల్ కేసు.. ఏం జరిగిందంటే..?

లేడీ డైరెక్టర్ పై క్రిమినల్ కేసు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ పై కేసు నమోదైంది. హోలీ పండుగను ఉద్దేశించి ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీనివల్ల మతపరమైన సెంటిమెంట్స్ దెబ్బతీయడమే కాకుండా ఒక వర్గాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని పేర్కొంటూ వికాశ్ అనే వ్యక్తి ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 

ఆమె వ్యాఖ్యలు తనని ఎంతగానో బాధించాయన్నాడు. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు అయింది. 1992లో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఫరా.. ‘సిసింద్రీ', 'బోర్డర్', 'ఇరువర్', 'దిల్ సే', 'బాద్ షా', 'జోష్', 'దిల్ చాహ్హ హై', ‘క్రిష్’, 'ఓం శాంతి ఓం' చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసింది. 2004లో 'మైన్ హుస్' అనే షారుక్ ఖాన్ తో డైరెక్టర్ గా మారింది. ప్ర స్తుతం 'సెలబ్రిటీ మాస్టర్చెఫ్’లో ఫరా ఖాన్ జడ్జిగా వ్యవహరిస్తోంది.