గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే కడప అమీన్ పీర్ దర్గాకి వెళ్ళి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ దర్గా కి వెళ్ళడం వివాదానికి దారి తీసింది. ఇప్పటికే 5 రోజుల్లోపు రామ్ చరణ్ అయ్యప్ప స్వాములకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో శంషాబాద్ అయ్యప్ప స్వామి సొసైటీ సభ్యులు హీరో రామ్ చరణ్ పై శంషాబాద్ ఆర్జిఐఎ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేగాకుండా రామ్ చరణ్ పవిత్ర అయ్యప్ప మాలలో ఉండి దర్గాలోకి వెళ్లడాన్ని అయ్యప్ప స్వాములు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కడప దర్గాకి వెళ్ళడమే కాకుండా నుదుట బొట్టు తీసేసి పూజలు నిర్వహించడం దారుణమని అయ్యప్ప భక్తులు అంటున్నారు.
ALSO READ | మా ఆయన దర్గాకు వెళితే తప్పేంటీ : భర్తకు మద్దతుగా ఉపాసన పోస్ట్
అలాగే అయ్యప్ప స్వాములకు, హిందూ భక్తులకు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని స్వాములు హెచ్చరించారు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల ఫిర్యాదుమేరకు హీరో రామ్ చరణ్ పై కేసు నమోదు చేశామని అన్నారు. అలాగే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.