కేంద్రమంత్రి కుమారస్వామిపై ఎఫ్ఐఆర్

కేంద్రమంత్రి కుమారస్వామిపై ఎఫ్ఐఆర్

జేడీఎస్ నేత, కేంద్రమంత్రి హెచ్ డీ కుమార స్వామిపై కేసు నమోదయ్యింది. ఏడీజీపీ, సిట్ చీఫ్  ఎం చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు నవంబర్ 4 సోమవారం కుమారస్వామిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు.   రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కుంభకోణంపై జరుగుతున్న విచారణను అడ్డుకునేందుకు కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో  తెలిపారు.

కుమారస్వామి, నిఖిల్‌లు తన దర్యాప్తును అడ్డుకోవాలనే ఉద్దేశంతో  ఆరోపణలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు . సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కేసుపై  చంద్రశేఖర్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.

Also Read :- అన్నీ పార్టీలకు మేఘా విరాళాలు ఇలా...

కుమారస్వామి 2006 నుండి 2008 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బళ్లారి జిల్లాలోని శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ (SSVM)కి 550 ఎకరాల మైనింగ్ లీజును చట్టవిరుద్ధంగా మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై  చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో  విచారణ జరుగుతోంది. అయితే తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడానికి  బెదిరించినట్లు చంద్రశేఖరన్ ఫిర్యాదుచేశారు.