రంగారెడ్డి జిల్లా జన్వాడలో బుల్కాపూర్ ఫిరంగి నాలాపై సర్వే ముగిసింది. పోలీసుల బందోబస్తుతో ఆగస్ట్ 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే చేశారు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి ఫాం హౌజ్ ముందు నాలా పరిశీలించారు. నాలా పైనే ఫామ్ హౌజ్ మెయిన్ గేట్ కట్టినట్లు గుర్తించారు అధికారులు. 18 నుంచి 20 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా 4 నుంచి 5 మీటర్లు మాత్రమే ఉందని తేల్చారు. నాలా బఫర్ జోన్ అంతా అక్రమించినట్లు గుర్తించారు అధికారులు.
మొత్తం 21 కిలోమీటర్లు నాలా ఉండేదని అధికారులు చెబుతున్నారు. నక్ష, డీజీపీఎస్ తో డిజిటల్ సర్వే చేశారు అధికారులు. సర్వే రిపోర్ట్ ను ఉన్నతాధికారులకు సబ్మిట్ చేస్తామని చెప్పారు అధికారులు. దీని ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.