ఆకాశ్ ఇన్​స్టిట్యూట్ లో అగ్నిప్రమాదం

  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన  హైడ్రా కమిషనర్

హైదరాబాద్​సిటీ/గండిపేట, వెలుగు: షేక్​పేటలోని డ్యూక్స్ ఎవెన్యూ బిల్డింగ్​లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. బిల్లింగ్ సెకండ్ ఫ్లోర్​లోని ఆకాశ్ ఇన్​స్టిట్యూట్​లో మంటలు చెలరేగి ఫర్నిచర్ దగ్ధమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, అధికారులు మంటలను అదుపు చేశారు.

ప్రమాద సమయంలో బిల్డింగ్​లో ముగ్గురు ఉండగా, వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఘటనాస్థలాన్ని హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్  పరిశీలించారు. సీసీ పుటేజీని పరిశీలించి అగ్ని ప్రమాదానికి కారణాలను గుర్తించాలన్నారు.